గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Minister Indrakaran reddy | సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బడి బాట పట్టారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలను మంత్రి
నిర్మల్ : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బడి బాట పట్టారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్లో వంట గది, భోజన శాల, వసతి ఇలా అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను, మెనును అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

ఇటీవల ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనల నేపథ్యంలో వంట గదిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తాజా కూరగాయాలను వండాలని, బియ్యం, గుడ్లు, ఇతర వంట సామాగ్రి ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో ఆయన మాట్లాడారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా.. అని ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

