కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా పెంచండి.. కేంద్రమంత్రికి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్ : కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి రెండు రోజులకు సరిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావుకు కేంద్రమంత్రికి లేఖ రాశారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106శాతం సాధించిందని, రెండో డోస్ వ్యాక్సినేషన్లో 104శాతం సాధించామన్నారు. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి వాక్సినేషన్‌లోనూ దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రికాషనరీ డోస్ విషయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతీ రోజు 3 లక్షల డోస్‌లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాక్సిన్ కొరతతో రోజుకు కేవలం 1.5 లక్షల డోస్‌లు మాత్రమే ఇవ్వగలుగుతున్నామన్నారు. ప్రస్తుత డిమాండ్ మేరకు మాకు వాక్సిన్ సరఫరా కావడం లేదని, రాష్ట్రంలోని డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ సరఫరా ఎప్పటికప్పుడు పెంచాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్‌లు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, వెంటనే 50 లక్షల కోవిషీల్డ్ డోస్ వాక్సిన్ రాష్ట్రానికి పంపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

