Minister Harish rao | మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం: మంత్రి హరీశ్ రావు
మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు.
సిద్దిపేట: మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రులు తెలంగాణను (Telangana) ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడతారా అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నదని విమర్శించారు. సిద్దిపేటలో (Siddipet) పీవీ.నర్సింహారావు (PV Narasimha rao) పశువైద్య కళాశాల భవన నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వెటర్నరీ కాలేజీ సిద్దిపేటకు వచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
పీవీ ఘాట్ కట్టడానికి కాంగ్రెస్ వాళ్లు అనుమతి ఇవ్వలేదని, వైద్యశాలకు పీవీ పేరు వారి గౌరవాన్ని పెంచిన ఘటన సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. కాళోజీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ పేర్లతో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరంతో ఎండా కాలంలోనూ జలసిరి పెరిగి అలుగుపారుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లాలో 12,460 మంది మత్స్యకారులకు కొత్తగా సభ్యత్వం అందించామన్నారు. 3.70 లక్షల మందికి రెండో విడుత గొర్రెలు పంపిణీ చేయనున్నామని తెలిపారు.

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ: మంత్రి తలసాని
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ మెరుగుపడిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధది ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని నిలదీశారు. మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరుకు రెండో విడుత గొర్రెల పంపిణీ చేపడుతామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగో పశు వైద్య కళాశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పెరిగిన జీవాల సంఖ్యకు అనుగుణంగా నూతన పశువైద్యులను తీర్చిదిద్దడానికే వెటర్నరీ కాలేజీలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

