Minister Harish Rao | పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి.. : హరీశ్‌రావు
Minister Harish Rao | పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్‌లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
Minister Harish Rao | పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్‌లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3లక్షల ఇంటి మహాలక్ష్మి పేరుమీద ఇస్తున్నామన్నారు. మహిళలకు డబ్బులు ఇస్తే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందన్నారు. అందరికీ ఒకేసారి ఇవ్వడం ఇబ్బందని, ముందువెనుకా అందరికీ ఇస్తామన్నారు. అందరు మనవాళ్లేనని, ఉండేది మన ప్రభుత్వమే.. సీఎం మన కేసీఆరేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో లంచాలు ఇచ్చిన ఇల్లు దక్కలేదని, తిరిగి తిరిగి కళ్లు అరిగేవన్నారు. మన ప్రభుత్వంలో ఏ మధ్యవర్తులు లేకుండా పైరవీలు లేకుండా నేరుగా ఖాతాల్లోనే డబ్బులు జమచేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎవరైనా డబ్బులు అడిగితే నాకు చెప్పండి
లంచం, మిత్తి, అప్పు లేదని, ఎది లేకుండా మీకు పైసలు వస్తాయని, మన దగ్గర ఎవ్వరు మిమ్మల్ని డబ్బులు అడగరని.. తప్పుదారి ఎవరైనా అడిగితే తనకు చెప్పాలన్నారు. పంచాయతి సెక్రెటరీ, సర్పంచ్ అందరూ మీకు అందుబాటులో ఉండి డబ్బులు ఇప్పిస్తరు. మీరు త్వరగా పని మొదలుపెట్టాలని.. రెండు నెలల వరకు చూసి పని స్టార్ట్ చెయ్యని వారికి బదులు మరొకరిని ఎంపిక చేస్తామన్నారు. పాలమూరు జిల్లా ప్రజలకు తమకు నీళ్లు వచ్చాయని రెండు పంటలు బాగా పండుతయని సంతోషంగా ఉన్నారన్నారు.
నాడు పాలమూరు జిల్లా కరువు పీడిత, వలసలు పోయిన ప్రాంతమని, పాలమూరు ప్రజల కళ్లల్లో ఆనందం వేస్తే.. కానీ కాంగ్రెస్ వాళ్ల కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాజెక్టులకు అడ్డంపడడం.. కేసులు పెట్టించి పనులు ఆపే ప్రయత్నం చేశారని, – మన ప్రభుత్వం అభివృధి ముందుకు పోతుంటే.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ తిట్లు తిటడ్డంలో పోటీపడుతున్నారన్నారు. పని చేసిన ప్రభుత్వం వైపు ఉంటారా..? గోబెల్స్, అబద్ధాలు ప్రచారం చేసే వారి వెంట ఉంటారా ? సద్ది తిన్న రేవు తలవాలి.. సహాయం చేసిన వారిని మరవొద్దన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మన ప్రాజెక్ట్ కాలువల్లో నీళ్లు పారుతున్న ఒక సుక్క రాలేదు అంటున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

