మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తి: మంత్రి హరీశ్ రావు
Minsiter Harish rao | రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. నగరంలోని చార్మినార్ యునానీ దావాఖానలో బూస్టర్ డోసు పంపిణీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టీకా విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. బూస్టర్ డోసుతో ప్రయోజనాలు ఉన్నాయని, అర్హులంతా బూస్టర్ డోసు వేసుకోవాలని చెప్పారు.
అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోసు వేసుకుంటున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లలో 38 శాతం మందికి మొదటి డోసు వేశామన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
యునానీ దవాఖాన సమస్యలపై చర్చించామని, త్వరలో హాస్పిటల్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దవాఖానలో ఖాళీల భర్తీకి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రొఫెసర్లు కూడా మరిని సేవలు అందించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

