‘మన ఊరు-మనబడి’కి మంత్రి చేయూత
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్ల అభివృద్ధికి మంత్రి గంగుల కమలాకర్ చేయూతనిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన సోదరుడి పేరిట రూ.20 లక్షల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించారు.
- రూ.20 లక్షల విరాళం ప్రకటించిన గంగుల
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 20: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్ల అభివృద్ధికి మంత్రి గంగుల కమలాకర్ చేయూతనిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన సోదరుడి పేరిట రూ.20 లక్షల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించారు.
బుధవారం ఆయన కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రూ.65 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రూ.2 లక్షలు ఇస్తే మేనేజ్మెంట్ కమిటీలో సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. రూ.10 లక్షలిస్తే తరగతి గదికి, రూ.కోటి ఇస్తే ఆ పాఠశాలకు వారి పేరు పెడుతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, నగర మేయర్ వై సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

