బమ్మెర పోతనకు నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి గ్రామంలోని పోతన మందిరాన్ని సందర్శించారు. పోతన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే ఆవరణలో గల శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్ర ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహా భాగవతం రచించిన పోతన తెలుగు వారు గర్వించదగ్గ కవి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు బమ్మెరలో అభివృద్ధి పనులు కూడా చకచకా సాగుతున్నాయని ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అధికారులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tharun Bhascker | మోకాళ్ల మీద పడి సార్, మేడమ్ అని పిలవను.. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు: తరుణ్ భాస్కర్
Naga Chaitanya | ఏడవాలని ఉంటుంది, కానీ కన్నీళ్లు రావు.. తనలోని బాధను బయటపెట్టిన నాగ చైతన్య
Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nayanthara | నయనతార పోలికతో ట్రాన్స్‌జెండర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు.. !
Chiranjeevi | ఓటీటీ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్.. ‘మెగావర్స్’ కోసం చిరంజీవికి రూ.200 కోట్లు ఇస్తున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

