మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు: మంత్రి ఎర్రబెల్లి
Errabelli Dayakar rao | ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపల పెంపకం పరిశ్రమగా
హైదరాబాద్: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపల పెంపకం పరిశ్రమగా అభివృద్ధి చెందిందని, నీలి విప్లవం కొనసాగుతున్నదని చెప్పారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. కాకతీయులు, రెడ్డి రాజులు అందించిన చెరువులను సుసంపన్నం చేసి, రిజర్వాయర్ల నిర్మాణంతో జలకళను తెచ్చి రాష్ట్ర జీవికను సుస్థిరం చేశారన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మత్స్యసంపదను పెంచేందుకు విశేషమైన కృషి జరుగుతుందన్నారు.
మత్స్య సంపద వల్ల రాష్ట్రంలోని 30 లక్షల మంది మత్స్యకారులు లబ్ధిపొందుతున్నారని, ఇప్పటికే 23 వేల చెరువులను జియోట్యాగింగ్ చేశామని వెల్లడించారు. నీటి సంపదనుపెంచి చేప పిల్లలను ఉచితంగా ఇచ్చి, వాటిని పెంచడానికి పరికరాలను అందించి మత్స్య సంపదనను ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చామని, తద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

