పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వ హాస్పిటళ్లు: మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli Dayakar rao | ప్రభుత్వ దవాఖానలు పేదల పెన్నిధిగా మారాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని చెప్పారు.
హనుమకొండ: ప్రభుత్వ దవాఖానలు పేదల పెన్నిధిగా మారాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లోనే నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్ జడ్జిగా సేవలు అందిస్తున్న రాచర్ల శాలిని.. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి హాస్పిటల్‌కు వెళ్లిన మంత్రి.. శాలినిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా జడ్జిగా ఉండి ప్రభుత్వ దవాఖానలో ప్రసవించడం ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందించినట్లయిందన్నారు.
వరంగల్ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటళ్లను రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ దవఖానాల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని తేలిందన్నారు. సర్కారు దవాఖానల్లో 80 నుంచి 90 శాతం వరకు సాధారణ డెలివరీలు అవుతుండగా, ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రం 60 నుంచి 70 ఆపరేషన్లు జరుగుతున్నట్లు నివేదిక ఉందని చెప్పారు. భవిష్యత్తులో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేటట్లు చూస్తామన్నారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స బాగా అందిస్తూ.. పేదల పెన్నిధిగా మారాయని మంత్రి చెప్పారు. కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన వారికి రూ.12 వేలు అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

