మహాధర్నా ఫలితంగానే సాగు చట్టాల రద్దు: మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదేస్ఫూర్తితో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

హనుమకొండ: టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదేస్ఫూర్తితో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపి ప్రభుత్వం మెడలు వంచి విజయం సాధించిన రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని మరిచి, కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చిందని, వాటికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని కోరేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను సీఎం కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా బీజేపి, కాంగ్రెస్ నాయకులు బుద్ది తెచ్చుకొని తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

