శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 00:47:32

ఏఐలో 30వేల మందికి శిక్షణ

ఏఐలో 30వేల మందికి శిక్షణ

  • టాస్క్‌, ఉన్నత విద్యా మండలితో మైక్రోసాఫ్ట్‌, నాస్కాంతో భాగస్వామ్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:   అధునాతన సాంకేతికతను రాష్ట్ర విద్యార్థులకు చేరువ చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలె డ్జ్‌ (టాస్క్‌), తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) మైక్రోసాఫ్ట్‌, నాస్కామ్‌తో చేతులు కలిపాయి. దీంతో 30వేలమందికి కృత్రిమ మేధ స్సు (ఏఐ)పై శిక్షణ పొందే అవకాశం కలిగింది. ‘మార్చ్‌ టు మిలియన్‌' పేరిట చేస్తున్న ప్రయత్నంలో పాలుపంచుకొనేందుకు మైక్రోసాఫ్ట్‌, నాస్కామ్‌ ముందుకొచ్చాయి. 2021 నాటికి కనీసం10 లక్షల మందికి అధునాతన సాంకేతికతలో శిక్షణ నివ్వాలని లక్ష్యం గా నిర్దేశించుకున్నారు. ఐటీశాఖ ము ఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తదితరులు.. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌లో ఏఐ క్లాస్‌ రూం సీరీస్‌లను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నై పుణ్యాల పెంపుతో, యువత.. ఉద్యోగ అవకాశాలు అందుకొనేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం నవంబర్‌ 23 నుంచి ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. భవిష్యత్‌ నైపుణ్యాలను తెలంగాణ విద్యార్థులకు అందించేందుకు మైక్రోసాఫ్ట్‌, నాస్కాం ముందుకు రావటం గొప్ప విషయం అన్నారు. ప్రపంచ సాంకేతికతలు వేగంగా మా రుతున్నాయని, యువత ఈ సాంకేతిక విప్లవంలో భాగస్వాములుగా ఉండాలని కోరారు. టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా మాట్లాడుతూ.. ఉద్యోగ అవకాశాలను అందుకొనేలా యువతను తీర్చిదిద్దేందుకు టాస్క్‌ కృషి చేస్తున్నదని, ఈ చొరవ మరింత ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా నేషనల్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రోహిణి శ్రీవాస్తవ, నాస్కామ్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సీఈవో అమిత్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.