హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి (Assistant Professor Recruitment) మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రోజుల క్రితం డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వేయగా జూన్ 10 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 2322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1931 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా మెరిట్ జాబితాలు సిద్ధమవుతున్నాయి.