ములుగు, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ)/టేకుమట్ల: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పెద్దాపురం గ్రామపంచాయతీ పరిధి చింతలపల్లి గ్రామ కార్యదర్శికి కలెక్టర్ రాహుల్‌శర్మ మెమో జారీ చేశారు. గ్రామంలో మహిళలంతా బుధవారం ఎంగిలి పూల బతుకమ్మను చీకట్లో ఆడగా ‘నమస్తేతెలంగాణ’ మెయిన్‌లో ‘చీకట్లోనే బతుకమ్మ సంబురాలు’ శీర్షికన గురువారం కథనాన్ని ప్రచురించింది.
చింతలపల్లి గ్రామం ములుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నా.. జిల్లా పరంగా భూపాలపల్లి జిల్లాలోకి వస్తుంది. ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆరా తీశారు. గ్రామ కార్యదర్శి కవితకు గురువారం మెమో జారీ చేశారు. పెద్దంపల్లిలో బతుకమ్మ ఆడే స్థలం వద్ద అధికారులు విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్థులు ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.