మేడిగడ్డ బరాజ్ శిలాఫలానికి దిక్కేది?
జయశంక ర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మం డలం అంబట్పల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రారంభోత్సవ శంకుస్థాపన శిలాఫలకానికి సంబంధించిన నేమ్ బోర్డు పకకు పడేసి ఉండ టం తీవ్ర చర్చనీయమైంది.
- పకన పెట్టిన స్థితిలో శంకుస్థాపన బోర్డు
మహదేవపూర్,అక్టోబర్ 29 : జయశంక ర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మం డలం అంబట్పల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రారంభోత్సవ శంకుస్థాపన శిలాఫలకానికి సంబంధించిన నేమ్ బోర్డు పకకు పడేసి ఉండ టం తీవ్ర చర్చనీయమైంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును జూన్ 21, 2019న ప్రారంభించిన విషయం తెలిసిందే. బరాజ్‌కు సంబంధించిన శిలాఫలకం ఇలా నిర్లక్ష్యానికి గురికావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన శిలాఫలకానికి సంబంధించిన నేమ్ బోర్డు పకకు పడిపోయి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.
బోర్డు ప్రమాదవశాత్తు పడిపోయిం దా? లేక ఎవరైనా కావాలనే పకకు పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి బోర్డుకు మరమ్మతు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రాజెక్ట్ డీఈఈ సురేశ్‌ను వివరణ కోరగా శిలాఫలకానికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, రెండు నేమ్ బోర్డుల్లో ఒకటి కిందపడిపోగా దానిని కార్యాలయంలోనే ఉంచామని, మరొకటి అక్కడే ఉందని చెప్పారు. త్వరలోనే మరమ్మతు చేయించి పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

