హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మెడికల్ పీజీ కన్వీనర్ కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు కాళోజీ హెల్త్ వర్సిటీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ-2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు బుధవారం ఉదయం 8 నుంచి అక్టోబర్ 8 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన ధ్రువపత్రాలను https://tspgmed.tsche.in/ వెబ్సైట్లో సమర్పించాలని కోరింది. టెక్నికల్ హెల్ప్ కోసం 9392685856,7842 13 6688, 9059672216 నంబర్లను సంప్రదించాలని సూచించింది.