డేంజర్ జోన్లో మెడికల్ కాలేజీలు
తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది.
- వసతుల లేమి, సర్కారు నిర్లక్ష్యంపై ఎన్ఎంసీ సీరియస్
- 26 మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్య మండలి నోటీసులు
- 18న విచారణకు రావాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈకి నోటీసులు
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది. విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు మృతదేహాలు (క్యాడావర్), ప్రయోగశాలలు, క్లినికల్ పారామీటర్లు లేవని సీరియస్ అయింది. వసతుల లేమిపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇచ్చిన వివరణతో ఎన్ఎంసీ సంతృప్తి చెందలేదు. నిరుడు గుర్తించిన లోపాలను ఇప్పటికీ సరిదిద్దుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కాలేజీలకు రూ.2లక్షల నుంచి రూ.13 లక్షల వరకు జరిమానా విధించింది. వైద్య కళాశాల్లోని లోపాలపై చర్చించేందుకు ఈ నెల 18న ఢిల్లీలోని జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) కార్యాలయంలో నిర్వహించే విచారణకు వర్చువల్గా హాజరు కావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శితోపాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) శుక్రవారం ఆదేశించింది.
ప్రమాదంలో 2,700 మెడికల్ సీట్లు
మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు ఉ న్నాయో లేదో ఎన్ఎంసీ పరిశీలిస్తుంది. ఈ ఏ డాది రాష్ట్రంలోని 35 కాలేజీల్లో తనిఖీలు చే సిన ఎన్ఎంసీ.. 26 కాలేజీల్లో వసతులు లేవని గుర్తించింది. ముఖ్యంగా విద్యార్థుల అటెండెన్స్, క్లినికల్ ట్రైనింగ్, మౌలిక సదుపాయాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్టు తేల్చింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) ఆ కళాశాలను కొనసాగించాలో లేక రద్దు చేయాలో నిర్ణయించేందుకు విచారణకు హాజ రు కావాలని ఆదేశించింది. దీంతో 2,700 మెడికల్ సీట్లు ప్రమాదంలో పడనున్నాయి.
కేసీఆర్ సంకల్పానికి తూట్లు
2014లో స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణలో 5 ప్రభుత్వ, 15 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, వాటిలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో జిల్లాలో ఒకో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయించడంతో 2023 అక్టోబర్ నాటికి మొత్తం కళాశాలల సంఖ్య 56కు, సీట్ల సంఖ్య 8,340కి చేరింది. అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం మరో 8 కాలేజీలను మంజూరు చేయడంతో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 9,140కి పెరిగింది. కానీ, కేసీఆర్ సంకల్పానికి తూట్లు పొడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు.. వైద్య కళాశాలల్లో కనీసం వసతులు కల్పించలేని దుస్థితిలో ఉన్నది.
ప్రతి మెడికల్ కాలేజీని కాపాడుకుంటాం:మంత్రి రాజనర్సింహ
రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీని కాపాడుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రతి కాలేజీలో మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
నిబంధనలు పాటించని 26 కాలేజీలు ఇవే..
ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, కుత్బుల్లాపూర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి.
తక్షణమే నిధులు విడుదల చేయాలి..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం రేవంత్రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయం. 26 మెడికల్ కాలేజీల్లో నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు, వసతులు లేకపోవడంపై ఈ నెల 18న ఎన్ఎంసీ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈకి తాఖీదులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఇంత ముఖ్యమైన విషయంపై సీఎం ఆలస్యంగా మేల్కొని, ఎట్టకేలకు సోమవారం ఓ కమిటీని వేయడం హాస్యాస్పదం. ఆ 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా? మీ పరిపాలన వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కాపాడాలి. వైద్యులు కావాలనుకుంటున్న విద్యార్థుల జీవితాలను నిలబెట్టాలి.
– మాజీ మంత్రి హరీశ్ రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

