హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు https://tsmedadm.tsche.in/ వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని నోటిఫికేషన్లో కోరింది.
వైద్య విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి ; కాళోజీ వర్సిటీ వీసీకి హెచ్ఆర్డీఏ ప్రతినిధుల వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల్లో చదువుతున్న యూజీ, పీజీ వైద్య వి ద్యార్థులకు ఇన్సూరెన్స్ సౌకర్యం క ల్పించాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాం డ్ చేసింది. సోమవారం కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ నందకుమార్రెడ్డికి వినతిపత్రం అందజేసింది. అనంతరం అ సోసియేషన్ అధ్యక్షుడు బ్రహ్మేశ్వర్, జనరల్ సెక్రటరీ కార్తిక్ మాట్లాడు తూ.. ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో హైరిస్క్ వాతావరణంలో వైద్య విద్యార్థులు పనిచేస్తారని తెలిపారు.