Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వై. జహంగీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ మొదటి సెమిస్టర్ (బ్యాక్లాగ్) ఐటీ కంప్యూటర్ ప్రాక్టికల్ ల్యాబ్ పరీక్షలను ఉదయం పది గంటల నుంచి సికింద్రాబాద్‌లోని వెస్లీ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్, ల్యాబ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్‌తో పరీక్షకు హాజరుకావాలని సూచించారు.