Massive transfers | తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు.. గ్రేటర్ హైదరాబాద్ డీసీగా శ్రీనివాస్‌రెడ్డి
Massive transfers | రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్లు గా పనిచేస్తున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ ( Excise Department) లో డిప్యూటీ కమిషనర్లు ( Deputy Commissioners ) గా పనిచేస్తున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న జె హరికిషన్‌ను సైబరాబాద్ డీసీగా, నల్గొండలో డీసీగా పనిచేస్తున్న ఏ శ్రీనివాస్‌రెడ్డి( Srinivas Reddy) ని గ్రెటర్ హైదరాబాద్ డీసీగా బదిలీ చేశారు.
రంగారెడ్డి డీసీగా ఉన్న దశరథను టీజీబీసీఎల్ డీసీగా, ఖమ్మంలో డీసీగా ఉన్న జనార్దన్ రెడ్డి ఆదిలాబాద్ డీసీగా బదిలీ చేశారు. టీజీబీసీఎల్ ఆర్ఆర్-1లో ఉన్న దాతురాజు గౌడ్‌ను వరంగల్ డీసీగా, నిజామాబాద్‌లో ఏసీగా ఉన్న వి.సోమిరెడ్డిని ఖమ్మం డీసీగా, కరీంనగర్ బీసీఎల్లో మేనేజర్‌గా ఉన్న రవీకుమార్ను కరీంనగర్ డీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీ లేబుల్స్‌లో పనిచేస్తున్న పి శ్రీధర్‌ను నిజామాబాద్ డీసీగా, హెడ్‌క్వార్టర్స్‌లో డీసీగా ఉన్న కె రఘురాంను రంగారెడ్డి డీసీగా, హైదరాబాద్ ఏసీగా ఉన్న ఏ అనిల్ కుమార్ రెడ్డిని ఈస్ట్ జాయింట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.
స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లో ఏసీగా ఉన్న పి ప్రణవిని మల్కాజిగిరి డీసీగా, మహాబూబ్ నగర్ ఏసీ విజయ్ భాస్కర్ రెడ్డి డీసీ అక్కడే పదోన్నతి కల్పించింది. బ్రేవర్సీలో ఏసీగా ఉన్న చంద్రయ్యను మెదక్ డీసీగా, ఈస్ట్ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సీవీ శశిధర్ రెడ్డిని నల్గొండ డీసీగా బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

