Hyderabad | వినోద్ కుమార్‌తో మరాఠా మండల్ ప్రతినిధుల భేటీ
వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో బుధవారం మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో బుధవారం మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర మరాఠా మండల్ ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమి మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలో స్థిరపడిన మరాఠాలను గుర్తించి తగిన గౌరవాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని మరాఠా మండల్ ప్రతినిధులు పేర్కొన్నారు. సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు కూడా మరాఠా మండల్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
వినోద్ కుమార్ ను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ అధ్యక్షుడు ప్రకాష్ పాటిల్, ఉపాధ్యక్షుడు నివాస్ నికం, కార్యదర్శులు మదన్ జాదవ్, ఎల్కే షిండే, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

