ములుగు జిల్లాలో మావోయిస్టు మిలీషియా సభ్యుడి అరెస్ట్
మావోయిస్టు | జిల్లాలోని పామునూరు అటవీ ప్రాంతంలో నిన్న మావోయిస్టు మిలీషియా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని ఇవాళ మీడియా ముందు

ములుగు : జిల్లాలోని పామునూరు అటవీ ప్రాంతంలో నిన్న మావోయిస్టు మిలీషియా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులపై బాంబు దాడులు జరిపేందుకు పామునూరు అటవీ ప్రాంతంలో కుట్ర జరుగుతోందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసు బలగాలు పామునూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లాయి. కూంబింగ్ నిర్వహిస్తుండగా ఆదివారం ఉదయం 11 గంటలకు రోడ్డుపై బాంబులు అమర్చుతున్న కొంతమందిని పోలీసులు గమనించారు.
అప్రమత్తమైన బలగాలు.. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా అందరూ తప్పించుకున్నారు. ఒకర్ని మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. అతన్ని అదే రోజు సాయంత్రం 4 గంటలకు వెంకటాపురం పీఎస్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్నవ్యక్తిని వెంకటాపూరం నూగూరు మండలంలోని జల్లా గ్రామానికి చెందిన మడవి భూదు(40)గా పోలీసులు గుర్తించారు. భూదు నుంచి కార్డెక్స్ వైర్(40 మీటర్లు), నాలుగు డిటోనేటర్లు, ఒక వాకీ టాకీ, 2 ప్రెషర్ కుక్కుర్ బాంబులు, 2 టిఫిన్ బాక్స్ బాంబులు, రెండు ఎలక్ర్టిక్ వైర్ కట్టలు, బ్యాటరీలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

