మహాదేవుడిని వదలని రేవంత్ సర్కార్
రేవంత్ సర్కార్ దేవుళ్ల పేరిట దోచుకోవడానికి సిద్ధమైనదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ ప్రాజెక్టు ఖర్చు రూ.700 కోట్లు ఉండగా.. జీవో వచ్చే సరికి రూ.948 కోట్లకు ఎందుకు పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సోమవారం ఓంకారేశ్వర ఆలయ ప్రాజెక్టుపై ఆయన ఎక్స్‌వేదికగా స్పందించారు. ఆలయ ప్రాజెక్టు వ్యయం రూ.250 కోట్లకు పెంచి..
- రూ.700 కోట్ల ఆలయ ప్రాజెక్ట్..
- 948 కోట్లు ఎట్లయింది? : దాసోజు శ్రవణ్
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ దేవుళ్ల పేరిట దోచుకోవడానికి సిద్ధమైనదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ ప్రాజెక్టు ఖర్చు రూ.700 కోట్లు ఉండగా.. జీవో వచ్చే సరికి రూ.948 కోట్లకు ఎందుకు పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సోమవారం ఓంకారేశ్వర ఆలయ ప్రాజెక్టుపై ఆయన ఎక్స్‌వేదికగా స్పందించారు. ఆలయ ప్రాజెక్టు వ్యయం రూ.250 కోట్లకు పెంచి.. ఏ కాంట్రాక్టర్ కడుపు నింపుతున్నారని ప్రశ్నించారు. ఆఖరికి మహాదేవుడి పేరిట కూడా దోపిడేనా అని మండిపడ్డారు. కాంగ్రెస్ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండాపోతున్నదని విమర్శించారు. ఒక అడుగు తవ్వలేదు. ఒక ఇటుకా పేర్చలేదు.. కానీ మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకాయని పేర్కొన్నారు. రూ.700 కోట్ల ప్రాజెక్ట్ కాస్తా.. జీవో వచ్చేసరికి ఆలయానికే రూ. 948.65 కోట్లు, రోడ్డు పనులతో కలిపి మొత్తం రూ.1,108.27 కోట్లకు చేరిందని తెలిపారు. ఇంత భారీగా అంచనాలు పెంచడం వెనుక ఉన్న మతలబు ఏంటని నిలదీశారు. స్వయంగా సీఎం పర్యవేక్షించే శాఖలోనే ఈ అడ్డగోలు పెంపు ఎవరి జేబులు నింపడానికో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాల పేరుతో సాగుతున్న ఈ అంచనాల దందా ఆరోపణలపై తక్షణమే బహిరంగ విచారణ జరిపించాలి అని దాసోజు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

