Mahatma Jyothi Rao Phule | అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం 12న మహాధర్నా
Mahatma Jyothi Rao Phule | అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనుంది.
హైదరాబాద్ : అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyothi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలకు, బీసీ సంఘాలకు, మేధావులు, ప్రొఫెసర్లకు భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు.
మరోవైపు, అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి గానూ ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. జిల్లాల్లో జరిగే అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవుతారు.
6న తేదీన ఉదయం వరంగల్‌లో, మధ్యాహ్నం కరీంనగర్ లో, 7వ తేదీన ఉదయం వికారాబాద్‌లో, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో, 8వ తేదీన ఉదయం ఆదిలాబాద్‌లో, మధ్యాహ్నం నిజామాబాద్‌లో, 9వ తేదీన ఉదయం ఖమ్మంలో, మధ్యాహ్నం నల్గొండలో, 10వ తేదీన సంగారెడ్డిలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అన్నింటికి ఎమ్మెల్సీ కవిత హాజరవుతారు. జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నేతలు, ఇతర ప్రముఖులను రౌండ్ టేబుల్ సమావేశాలకు యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

