మెడికల్ హబ్‌గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ అదనంగా 10వేల కోట్ల రూపాయలను కేటాయించారు.

మహబూబాబాద్ : రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ అదనంగా 10వేల కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో వైద్యారోగ్య రంగానికి మహర్ధశ పట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్‌కు మంజూరు చేసిన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలకు కేటాయించిన స్థలాన్ని, నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి మాట్లాడారు.
ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లు అన్ని విధాల బలోపేతం కానున్నాయని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహబూబాబాద్ మెడికల్ హబ్ గా మారిందన్నారు.
మానుకోటకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, ఆక్సిజన్ ప్లాంట్ వచ్చాయి. ఇటీవలే 2.73 కోట్ల రూపాయలతో టి. డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభించుకున్నాం. వీటన్నింటి వల్ల ఇక్కడి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబాబాద్ మీదుగా కేంద్రం నుంచి మూడు జాతీయ రహదారులు వచ్చాయి. గ్రీన్ ఫీల్డ్ లో రోడ్డుకు సంబంధం లేకుండా నాగపూర్ నుంచి మచిలీపట్నం వరకు జిల్లా బైపాస్ గా జాతీయ రహదారి వస్తుందని తెలిపారు. భద్రాచలం నుంచి వయా తిరుమలగిరి, వలిగొండ, హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి వచ్చింది. కోదాడ నుంచి కొరివి వరకు వచ్చే లింక్ కలిపే జాతీయ రహదారికి నిధులు వచ్చాయి. ఇవన్నీ రావడంతో జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
భవిష్యత్ లో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు ఎక్కువ పండుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రాసిసెంగ్ కేంద్రాలు వచ్చాయి. తద్వారా ఈ ప్రాంతంలో మిర్చి రైతులకు మంచి ధరలు వస్తున్నాయి.
మిగిలిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి రైతులకు లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కలెక్టరేట్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ వి.పి గౌతమ్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

