Srisailam | శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం
శ్రీశైలంలో (Srisailam) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీశైలం మల్లన్న కొండ నిండిపోయింది.
శ్రీశైలం: శ్రీశైలంలో (Srisailam) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీశైలం మల్లన్న కొండ నిండిపోయింది. దీంతో శివనామ స్మరణతో ఇలకైలాస గిరులు మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే అర్ధనారీశ్వరుడిని దర్శనానికి భక్తులు బారులుతీరారు. దీంతో భక్తజనంతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి కిలోమీటర్ మేర భక్తులు వేచిఉన్నారు. ఇక లడ్డూ కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
శివరాత్రి సందర్భంగా స్వామిఅమ్మవార్లకు సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఆదిదంపతులకు నంది వాహనోత్సవం, రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు కీలకఘట్టమైన పాగాలంకరణ ఉంటుంది. ఇందులో భాగంగా ఆలయ విమానగోపురానికి, ముఖమండప నందులకు పాగాలంకరణ చేయనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు అంగరంగవైభవంగా కల్యాణం నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

