హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో పడిపోయిన పదో తరగతి ఆన్సర్ షీట్లు దొరికినట్టు రాష్ట్ర సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు.
ఉట్నూరు సబ్ పోస్టాఫీసు నుంచి బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో ఆన్సర్ షీట్లు పడిపోయినట్టు గుర్తించామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్సర్ షీట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపారు.