లాక్డౌన్ సడలించాలి

- అయినా ఆంక్షలు కొనసాగాలి
- అందరమూ బాధ్యతగా ఉండి మూడో ముప్పు ఎదుర్కొందాం
- డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించినా అంత తీవ్రత లేదు
- సీసీఎంబీ సలహాదారు రాకేశ్ మిశ్రా వ్యాఖ్యలు
ప్రత్యేక ప్రతినిధి, జూన్ 7 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లను సమర్థంగా అమలుచేయడం వల్ల తెలంగాణతోపాటు దేశంలోని చాలా ప్రాంతాలలో కేసులు తగ్గాయని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, ప్రస్తుత సలహాదారు రాకేశ్‌మిశ్రా తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యతతో మెలిగి, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే మూడో ముప్పును తేలికగా ఎదుర్కోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో డెల్టా వేరియంట్ (బీ.1.617.2) అతి వేగంగా విస్తరించినా దాని తీవ్రత (విరులెన్స్) తక్కువగా ఉందని ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. కానీ తమ పరిశీలనలో పాజిటివ్ రేటు అంతగా తగ్గలేదన్నారు. ప్రజలు ఒక చోట గుమిగూడక పోవడం, విందులు, శుభకార్యాలకు దూరంగా ఉండటం వల్ల కేసుల సంఖ్యలో మార్పు వచ్చిందని తెలిపారు.
అలాగే మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతికదూరం పాటించడం, పెండ్లిండ్లు, విందులు, వినోదాలకు పరిమిత సంఖ్యలోనే అనుమతించడం, జాతరలను అనుమతించకపోవడం వల్ల కరోనా మూడో ముప్పును నిలువరించవచ్చని సూచించారు. లాక్డౌన్లను ఎంతోకాలం కొనసాగించలేరన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కసారిగా కాకుండా లాక్డౌన్లను దశలవారీగా సడలించడం మంచిదని ఆయన సూచించారు. లాక్డౌన్ల వల్ల పేదల ఉపాధి దెబ్బతింటుదని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నది కాదనలేని కఠోర వాస్తవమని పేర్కొన్నారు. మొదటి దశలో కరోనా వైరస్ తీవ్రత తొందరగానే తగ్గినా చాలామంది ప్రాథమిక జాగ్రత్తలను విస్మరించడం వల్ల రెండవ దశ ముప్పు ముంచుకువచ్చిందని విశ్లేషించారు. కాస్త ఆలస్యంగానైనా లాక్డౌన్ల ద్వారా కరోనా వైరస్‌ను బ్రేక్‌డౌన్ చేయడానికి జరిగిన కృషి అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను తొందరగా పూర్తిచేస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశముంటుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

