లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
ఎస్పీ వెంకటేశ్వర్లు | ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా పోలీసు సమర్థవంతంగా పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు అన్నారు.

మహబూబ్‌నగర్ : ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా పోలీసు సమర్థవంతంగా పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల పన్నెండవ తేదీ నుంచి అమలవుతున్న లాక్ డౌన్ ప్రశాంతంగా జరగడంలో ప్రజలు చక్కగా సహకరిస్తున్నారని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా చట్టాన్ని ధిక్కరించిన వ్యక్తులను గుర్తించి, ఇప్పటివరకు జిల్లాలో మొత్తం (11,746) కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరాలను వెల్లడించారు.
వీటిలో 385 కేసులు దుకాణాల యజమానులపై కాగా, మాస్కులు ధరించని వారిపై 7,288 అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులపై 4,073 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మానవాళి అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మనమంతా క్రమశిక్షణ, బాధ్యాతాయుతంగా ఉంటూ మహమ్మారిపై విజయం సాదిద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు.
కరోనా సెకండ్ వేవ్‌లో యువతనే ఎక్కువగా బాధితులుగా ఉన్నారని సర్వేలు చెప్తున్నాయని, ఈ విషయాన్ని గుర్తించి కుటుంబ పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవొద్దన్నారు.
మన ఆరోగ్యం, కుటుంబం, సమాజం మొత్తాన్ని కాపాడుకునే క్రమంలో ఎవరికివారు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని ఎస్పీ ప్రజలను కోరారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్‌కు పంపించిన పోలీసులు
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

