హైదరాబాద్: హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉన్నది. దీంతో నగరంలో అక్కడక్కడ వర్షం కురుస్తున్నది. కాగా, రాష్ట్రంలోకి తూర్పు దిశ నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఈ గాలులతో ఉపరితల ద్రోణి శ్రీలంక నుంచి ఆంధ్రప్రదేశ్ తీరం వెంట సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చలిగాలుల ప్రభావంతో రాష్ర్టంలో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడుతుందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. రాష్ర్టంలో నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, శనివారం నుంచి 13వ తేదీ వరకు పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని వివరించింది.