మైనారిటీ హకుల సాధన కోసం పోరాడుదాం
దేశంలో కేవలం పేరుకే నవాబులు అని పిలిపించుకుంటూ, నిజజీవితంలో పూట గడువక కటిక పేదరికంలో మగ్గుతున్న ముస్లిం, ఇతర మైనారిటీల హకుల సాధన కోసం పోరాడుతున్నట్టు ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ నేతలు తెలిపారు.
- ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ జాతీయాధ్యక్షుడు అజీజ్
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : దేశంలో కేవలం పేరుకే నవాబులు అని పిలిపించుకుంటూ, నిజజీవితంలో పూట గడువక కటిక పేదరికంలో మగ్గుతున్న ముస్లిం, ఇతర మైనారిటీల హకుల సాధన కోసం పోరాడుతున్నట్టు ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ నేతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలను విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం, మైనారిటీల సమస్యలు తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈక్రమంలో వారిని ఇందిరా పార్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉతంఠ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ రాజకీయ నేతల అండతో కొందరు వేల కోట్ల విలువైన మైనారిటీ, వక్ఫ్ భూములు అక్రమంగా కాజేస్తూ, కోట్లు సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభాలో మైనారిటీల శాతానికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జమీల్, ఖాలీద్, కలీమ్, రెహమాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

