Sitarama project | సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను అడ్డుకున్న అఖిలపక్షం నాయకులు
Sitarama project | సీతారామ ప్రాజెక్ట్(Sitarama project) కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం సమీపంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ నిర్మాణ(Canal works) పనులను సోమవారం అడ్డుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : సీతారామ ప్రాజెక్ట్(Sitarama project) కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం సమీపంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ నిర్మాణ(Canal works) పనులను సోమవారం అడ్డుకున్నారు. తహసీల్దార్ స్వాతిబిందుకు ఆమె కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి మండలంలోని కాకర్ల, గుండెపుడి, పాపకొల్లు గ్రామాల్లోని చెరువులకు పిల్ల కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయుల కాలం నాటి పోలారం చెరువుకు మరమ్మతులు చేపట్టి ప్రాజెక్ట్‌ను నీటితో నింపితే జూలూరుపాడు, సుజాతనర్ మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగు నీరందించవచ్చని తెలిపారు.
అలా చేయకుండా.. ఈ ప్రాంత రైతాంగాన్ని విస్మరిస్తే భవిష్యత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. మండల రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా వినోభానగర్ నుంచి సాగర్ కెనాల్ వరకు మంజూరైన లింక్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, లేకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ముగ్గురు మంత్రులుండి.. జూలురుపాడు మండలంలోని రైతుల భూములను ఎండబెట్టేందుకు లింక్ కెనాల్ పేరుతో డిజైన్ మార్చి పనులను శరవేగంగా చేపట్టడం సరికాదన్నారు.
ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు జాటోత్ కృష్ణ, చండ్ర నరేంద్రకుమార్, ఉమర్మియా, ఏదులాపురం గోపాలరావు, గుండుపిన్ని వెంకటేశ్వర్లు, యాసా నరేశ్, వల్లోజి రమేశ్, చాంద్‌పాషా, బానోత్ మధు, వల్లమల చందర్రావు, లకావత్ శ్రీను, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, గడిదేశి కనకరత్నం, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

