ప్లీనరీలో 13 తీర్మానాలు.. ప్రతిపాదించేది ఎవరంటే..
TRS Plenary | టీఆర్ఎస్ ప్లీనరీకి (TRS Plenary) సర్వం సిద్ధమైంది. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్లీనరీలో 13 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీకి (TRS Plenary) సర్వం సిద్ధమైంది. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్లీనరీలో 13 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సీఎం కేసీఆర్ 11 గంటలకు ప్లీనరీ వేదికకు చేరుకుంటారు. మొదట పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభిస్తారు. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తీర్మానాలను ప్రవేశపెడుతారు.
ఏ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడుతారంటే..
1. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపాదిస్తారు.
2. దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని ప్రతిపాదిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు.
3. ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరలను నియంత్రించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెడుతారు.
4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి అమలు చేయాలని డిమాండ్ చూస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానం ప్రవేశపెడుతారు.
5. భారతేదశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ.వినోద్ కుమార్ తీర్మానం ప్రవేశపెడుతారు.
6. బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ మధుసూదనా చారి తీర్మానం ప్రవేశపెడుతారు.
7. తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మంత్రి మహమూద్ అలీ తీర్మానం ప్రవేశపెడుతారు.
8. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసులు చేయాలని మంత్రి హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెడుతారు.
9. నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
10. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపినిస్తూ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తీర్మానం ప్రవేశపెడుతారు.
11. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీర్మానం ప్రవేశపెడుతారు.
12. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రతిపాదిస్తారు.
13. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎల్.రమణ తీర్మానం ప్రవేశపెడుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- hicc
- Resolutions
- trs plenary
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

