Yadadri | యాదాద్రిలో అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం
Yadadri | యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
Yadadri | యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
జయంత్యుత్సవాల్లో భాగంగా సాయంత్రం 6:00 గంటలకు అంకురార్పణ, రుత్విగ్వరణం, హవనం నిర్వహించి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 2 నుంచి 4 వరకు సుదర్శన నారసింహహోమం, నిత్య, శాశ్వత తిరు కల్యాణోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
ఉత్సవాల సందర్భంగా ప్రధానాలయంలోని ఉత్తర రాజగోపురం వెలుపలి ప్రాకార మండపంలో యాగశాల ఏర్పాటు చేశారు. 3న 9 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, కాళీయ మర్థన అలంకార సేవలో స్వామివారిని తిరుమాఢవీధుల్లో ఊరేగించనున్నారు. 10:30 గంటలకు లక్ష పుష్పార్చనలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతారం అలంకార సేవ ఉంటుంది. 4న 7 గంటలకు మూలమస్తృ హవనం, ఉదయం 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు పూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

