ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం
నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు | ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి నితిన్ రెడ్డి కబ్జాలపై సీఎంకు ఫిర్యాదు అందించారు.

హైదరాబాద్ : భూకబ్జా వ్యవహారాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఈటల బాగోతం మరువకముందే ఆయన కుమారుడిపైనా ఇదే తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి నితిన్ రెడ్డి కబ్జాలపై సీఎంకు ఫిర్యాదు అందించారు.
తన భూమిని నితిన్‌రెడ్డి చెర నుంచి రక్షించి తనకు న్యాయం చేయాలని మహేశ్ దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం సూచించారు. వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అవినీతి నిరోదకశాఖ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

