హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫ్యాక్టరీస్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాల ప్రకారం 2024 సంవత్సరంలో కర్మాగారాలు, దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే కార్మికులకు జాతీయ పండుగలు, ఇతర సెలవు దినాలను నిర్ధారిస్తూ కార్మికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ దినాల్లో కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.
కర్మాగారాల్లో పనిచేసేవారికి సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఉగాది, రంజాన్, మేడే, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, విజయ దశమి ఇలా ఎనిమిది సెలవులు ఉండగా, దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసేవారికి సంక్రాంతి, రిపబ్లిక్ డే, మహాశివరాత్రి మరుసటిరోజు, రంజాన్, మేడే, తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, విజయదశమి ఇలా తొమ్మిది సెలవులను నిర్ధారించారు.
వచ్చే ఏడాది వేతన సెలవులు ఇలా..
పండుగ/ ఇతర సెలవు : తేదీ
సంక్రాంతి : జనవరి 15
రిపబ్లిక్ డే : జనవరి 26
శివరాత్రి మరుసటిరోజు : మార్చి 9
ఉగాది : ఏప్రిల్ 9
రంజాన్ : ఏప్రిల్ 11
మేడే : మే 1
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : జూన్ 2
స్వాతంత్య్ర దినోత్సవం : ఆగస్టు 15
గాంధీ జయంతి : అక్టోబర్ 2
దసరా : అక్టోబర్ 12