చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయండి: ఎల్.రమణ
చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమ నడ్డివిరిచేందుకే బీజేపీ సర్కారు కుట్ర పన్నుతున్నదని

చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమ నడ్డివిరిచేందుకే బీజేపీ సర్కారు కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలనే డిమాండ్‌తో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లో బుధవారం నిర్వహించిన హ్యాండ్లూమ్ మార్చ్‌లో పద్మశాలి సంఘం నేతలు, కార్మికులతో కలిసి ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు. అదేవిధంగా మార్చ్‌లో నటి పూనమ్ కౌర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అనేక కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే విధిస్తున్న 5శాతం జీఎస్టీని 12శాతానికి పెంచాలని నిర్ణయించి, వ్యతిరేకత వెల్లువెత్తడంతో వాయిదా వేసిందని వివరించారు. అయినప్పటికీ పరోక్షంగా మళ్లీ జీఎస్టీని విధించాలని యోచిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇకనైనా చేనేతపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీని పెంచాలని చూస్తే కచ్చితంగా అడ్డుకుంటామని కేంద్రాన్ని హెచ్చరించారు.
జీఎస్టీని రద్దు చేసేవరకూ పోరాటం: పూనమ్‌కౌర్
మార్చ్‌లో పాల్గొన్న సినీనటి పూనమ్‌కౌర్ మాట్లాడుతూ చేనేతపై జీఎస్టీని విధిస్తే ఆ రంగం కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత రంగం దేశానికి వెన్నముకని వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆమె కోరారు. మార్చ్‌లో పద్మశాలి సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

