అతీత శక్తుల పేరుతో రూ.3.5 కోట్ల బురిడీ.. దంపతులను మోసం చేసి ముఖం చాటేసిన కేటుగాడు
తనకు అతీత శక్తులున్నాయని నమ్మించిన ఓ కేటుగాడు వనపర్తి జిల్లా పెబ్బేరులోని దంపతుల నుంచి రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో వెంకటేశ్, పద్మ దంపతులు భాగ్యలక్ష్మి హోటల్‌ను నిర్వహిస్తున్నారు.
- వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన
పెబ్బేరు, నవంబర్ 30 : తనకు అతీత శక్తులున్నాయని నమ్మించిన ఓ కేటుగాడు వనపర్తి (Wanaparthy) జిల్లా పెబ్బేరులోని (Pebbair) దంపతుల నుంచి రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో వెంకటేశ్, పద్మ దంపతులు భాగ్యలక్ష్మి హోటల్‌ను నిర్వహిస్తున్నారు. తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో ఇతరులు చెప్పిన మాటలు విని నాలుగేండ్ల క్రితం ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరికి చెందిన జవలగేరి దుర్గాసింగ్ వద్దకు వెళ్లారు. దుర్గాసింగ్ వీరితో పూజల పేరిట విచ్చలవిడిగా ఖర్చు పెట్టించాడు. దంపతుల స్వగ్రామమైన అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లిలోని పొలంలో దేవతా విగ్రహం ఉందని నమ్మించాడు.
అర్ధరాత్రి అక్కడికి వెళ్లి పూజలు చేసి తవ్వించి ఒక విగ్రహాన్ని వెలికి తీయించాడు. అతీత శక్తులున్న ఈ విగ్రహానికి అంతర్జాతీయ మార్కెట్లో బాగా విలువ ఉంటుందని.. దాన్ని కొనేందుకు దేశ, విదేశీయులు ఆసక్తి చూపుతున్నారని నమ్మబలికాడు. నాలుగైదు సార్లు వీరిని ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లి భారీగా ఖర్చుపెట్టించాడు. దొరికిన విగ్రహం వారి వద్ద ఉంటే కుటుంబానికి ప్రమాదమని, పిల్లలు చనిపోతారని భయపెట్టాడు. ఓ అజ్ఞాత వ్యక్తి వీరికి ఫోన్ చేసి మిమ్మల్ని దుర్గాసింగ్ మోసం చేస్తున్నాడని చెప్పడంతో అప్పుడు బాధితులు తేరుకున్నారు.
అప్పటికే ఈ దంపతులు విడతల వారీగా ఆ వ్యక్తికి రూ.3.50 కోట్లు సమర్పించుకున్నారు. నాలుగేండ్లపాటు జరిగిన ఈ తతంగమంతా రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. బాధితులు ఆదోని పోలీసులను సంప్రదించగా, పట్టించుకోకపోవడంతో అక్కడి ఎమ్మెల్యే పార్థసారథిరెడ్డికి గోడు వెళ్లబోసుకున్నారు. వీరిని మోసం చేసిన వ్యక్తి ఆదోని మం డలం బైచిగేరిలో దుర్గాసింగ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్టు పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘరానా మోసం బయటకు రావడంతో ఆయన పరారైనట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

