KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.
హైదరాబాద్ : రేడియల్ రోడ్ ( Radial Road ) 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణం ( Scam) పై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కి లేఖ రాశారు. అనేక ఆరోపణలకు తావిచ్చి వందల కోట్ల ప్రజల సొమ్ము వృథా చేస్తున్న ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఆర్ఆర్ 2 టెండర్లపై పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని, ప్రతి అనర్హతకు నిర్దిష్ట కారణాలను పేర్కొంటూ సాంకేతిక మూల్యాంకన నివేదికను విడుదల చేయాలని సూచించారు.
మూడు ప్యాకేజీల ఆర్థిక వివరాలను వెల్లడించాలని, అంచనా వ్యయాలు, తుది కేటాయింపు విలువలు, అర్హత సాధించిన ప్రతి బిడ్డర్ ఆర్థిక బిడ్ వివరాలను విడుదల చేయాలని కోరారు. రూ.600 కోట్ల ఆర్థిక నష్టం ఆరోపణపై సమగ్ర విచారణ జరపాలని, ధరల వ్యత్యాసాలు, బిడ్ల వివరాలు, తుది కేటాయింపులపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. గత మూడేళ్లలోని భారీ కాంట్రాక్టులపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ చేపట్టిన రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్టులపై ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు.
టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలలని వెల్లడించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ,సాంకేతిక అర్హతలపై నిర్ణయాలు తీసుకునే విధానం, బిడ్డర్లు వివరణ ఇచ్చేందుకు కల్పించే అవకాశం, సాంకేతిక ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆర్థిక బిడ్లు తెరవడానికి అనుసరించే వ్యవధిపై స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని కేటీఆర్ సీఎంను డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

