KTR | త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ : కేటీఆర్
KTR | : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్(BRS) ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ జెండాను ఆవిష్క రించారు.
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్(BRS) ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై కేసీఆర్, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..దశాబ్దాలుగా అన్యాయనికి గురై నెత్తురు మండిన జాతి ఎత్తిన జెండానే గులాబీ జెండా అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగనప్పుడే సమస్యలకు చరమగీతం పాడవచ్చన్నారు. కేసీఆర్25 ఏండ్ల క్రితం జలదృశ్యంలో గులాబీ జెండా ఎత్తిపట్టారని గుర్తు చేశారు.
14 ఏండ్ల తన పోరాటంతో తెలంగాణ జాతిని ఐక్యం చేసి సబ్బండ వర్ణాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ కలను సాకారం చేశారన్నాను. సాధించిన తెలంగాణ కోసం అధికారం అప్పగిస్తే పదేండ్ల కాలంలో బాధ్యతగా పని చేసి అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. కానీ, రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఆరాచక పాలన మొదలైందన్నారు. కాంగ్రెస పాలనకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల తరఫున పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఏ బాధ్యత అప్పగించినా బీఆర్ఎస్ పార్టీ సమర్ధవంతంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని ప్రొ.జయశంకర్ అనేవారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ నుంచి రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడుదామన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేసేదాకా దండుగా కదం తొక్కుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దిశానిర్దేశం కోసం గులాబీ దండు ఎదురుచూస్తోందన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వారియర్స్, పార్టీ కార్యకర్తలకు, జర్నలిస్టులకు,కవులు, కళాకారులు, ఉద్యోగులు సమస్త ప్రజానికానికి వినమ్ర ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- Pink flag
- Telangana Bhavan
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

