MLC Dasoju Sravan | ఢిల్లీ ఘటనకు నిరసనగా పుట్టినరోజున ఇందిరాపార్కు వద్ద కేటీఆర్ దీక్ష : ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్
MLC Dasoju Sravan | ఢిల్లీ దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్షలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ : ఢిల్లీ దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిరసన ( Protest ) దీక్షలో పాల్గొననున్నారు. తన 50వ పుట్టినరోజున సంబరాలకు దూరంగా టూ ఢిల్లీ ఆందోళనకారులకు మద్దతు తెలియజేస్తూ ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాలో పాల్గొననున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ( MLC Dasoju Sravan ) వెల్లడించారు.
గురువారం బీఆర్ఎస్ ఎల్పీ విప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ( MLA Vivekananda ) తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పై జరుగుతున్న పోరాటంలో అందరం సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. గత రెండేండ్లుగా కేటీఆర్ యువతకు మద్దతుగా ఉంటున్నారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన యువ సంగ్రామ సదస్సులో విద్యార్థుల ఆక్రోశం ఏ విధంగా ఉందో వెల్లడైందని తెలిపారు. నీట్ పరీక్ష పై నిరసన తెలిపే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు.నీట్ పరీక్ష పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ (TGPSC ) గ్రూప్ 1 పరీక్షల తారుమారుకు పూర్తి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందేనని అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ అన్నప్పుడు.రేవంత్ రెడ్డి ని రాజీనామా చేయాలని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.జీవో 29 నిరుద్యోగులకు పెనుశాపంగా మారడానికి ఈ ప్రభుత్వమే కారణమని వెల్లడించారు.ఢిల్లీలో జరిగిన లాఠీచార్జ్ కు ఒక న్యాయం, హైదరాబాదులో నిరుద్యోగులపై జరిగిన లాఠీచార్జికి మరో న్యాయమా అంటూ నిలదీశారు.సిగ్గు, ఎగ్గు నైతికత ఉంటే విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు. : ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నామని శంభిపూర్ రాజు వివరించారు. వివిధ కారణాలతో యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాలేని మాజీ మంత్రి
మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

