కరీంనగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం కరీంనగర్ వస్తున్నట్టు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. అంబేద్కర్ మినీస్టేడియంలో విద్యార్థులు, యువత ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్మెంట్పై నిర్వహించే జెన్జీ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షించారు.
యువత, విద్యార్థి సంఘాల నాయకులతో కేటీఆర్ సభ, జన సమీకరణపై చర్చించారు. ఉదయం 10.15 గంటలకు కేటీఆర్ నేరుగా అంబేద్కర్ స్టేడియం చేరుకుని సభలో పాల్గొంటారని తెలిపారు.