KTR | నిజంగానే తెలంగాణ రైజింగ్.. మహిళల పట్ల నేరాల పెరుగుదలపై కేటీఆర్ ఫైర్
KTR | తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు.
KTR | తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ మహిళలపై నేరాల రేటులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని విమర్శించారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ మండిపడ్డారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ‘దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేనంతగా సీఎం/హోంమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణ మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సైబర్ నేరాల్లో కూడా టాప్‌లో ఉంది.’ అని ట్విట్టర్ (ఎక్స్)లో కేటీఆర్ పేర్కొన్నారు. వెల్డన్ రాహుల్ గాంధీ.. నిజంగానే తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యంగ్యంగా అభినందించారు.
Under the leadership of CM/Home Minister Revanth who has the highest criminal cases for any CM in the country
Now Telangana achieved highest rate of crime against women in India and also the topper in cyber crime too
Well done 👍 @RahulGandhi Ji
Telangana is indeed Rising… pic.twitter.com/v8SYAe91ic
— KTR (@KTRBRS) May 13, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

