ఏం ఉద్ధరించారని వస్తున్నవ్ ?
‘మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలను ఏం ఉద్ధరించారని హైదరాబాద్ వస్తున్నవ్ రాహుల్? అవసరమైనప్పుడు మౌనం వహించి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణగడ్డపై అడుగు పెడుతున్నవ్?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
- నిరుద్యోగుల గొంతునొక్కినప్పుడు మాట్లాడలేదేం?
- గిరిజన మహిళలపై దాడులకు స్పందించలేదేం?
- రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు
తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఆడబిడ్డలు అవమానాల పాలైనప్పుడు మౌనం వహించిన రాహుల్‌గాంధీ.. తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రచార ఆర్భాటం కోసం హైదరాబాద్‌కు వస్తున్నరా?. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈ ప్రచార పర్యటనలు చేసేందుకు మీకెవరు అధికారమిచ్చారు రాహుల్ జీ? దమ్ముంటే మేం సంధించే ప్రశ్నలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు.
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ) : ‘మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలను ఏం ఉద్ధరించారని హైదరాబాద్ వస్తున్నవ్ రాహుల్? అవసరమైనప్పుడు మౌనం వహించి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణగడ్డపై అడుగు పెడుతున్నవ్?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. శనివారం హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాహుల్‌గాంధీకి ‘ఎక్స్’ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ‘జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని పోరాడుతున్న నిరుద్యోగులు, విద్యార్థులను పోలీసులతో గొంతునులిమి దాడులు చేయించినప్పుడు మీరు ఎక్కడున్నరు? తమ భూములు గుంజుకోవద్దని పోరాడిన లగచర్లలో గిరిజన మహిళలను చావబాదినప్పుడు, వారి బట్టలు చింపి అవమానించినప్పుడు మీ మనస్సు చలించలేదేం?
రెక్కలు ముక్కలు చేసి కట్టుకున్న తెలంగాణ నిరుపేదల ఇండ్లను హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేస్తున్నప్పుడు మీరు ఢిల్లీలో నిద్రపోయారా? కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో రాత్రికిరాత్రే పదివేలకు పైగా చెట్లను నరికివేసి, నెమళ్లు, జింకలను వధించి, జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేసినప్పుడు మీ గొంతెందుకు పెగల్లేదు? కేబీఆర్ పార్క్‌ను నాశనం చేసిన వ్యహారం మీ దృష్టికి రాలేదా? రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అపహాస్యం చేస్తూ ఫిరాయింపు చట్టాన్ని ధిక్కరిస్తూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు మౌనంగా ఉన్నారెందుకు? పవిత్రమైన అసెంబ్లీ ఎదుట ప్రతిపక్ష బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి..చట్టసభల సాక్షిగా దాడులు చేసినప్పుడు కనీసం ఒక్క మాటైనా మాట్లాడకపోవడంలో మీ ఆంతర్యమేంది? రైతుల ఆత్మహత్యలు, నేత కార్మికుల బలవన్మరణాలు.. అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల అరెస్ట్‌లపై ఎందుకు స్పందించలేదు?
ఢిల్లీలోని కేంద్రం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలపై పోరాడుతున్న మీరు తెలంగాణ సర్కార్ కూడా అదే విధానాలు అమలు చేస్తుంటే నిలువరించలేదెందుకు? సర్కార్ పెద్దల భూ కబ్జాలపై స్పందించేందుకు మీకు సమయం దొరుకలేదా? మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ‘తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఆడబిడ్డలు అవమానాలపాలైనప్పుడు మౌనం వహించిన రాహుల్‌గాంధీ.. తెలంగాణ ప్రజల సొమ్ము రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటం కోసం వస్తున్నారా?’ అని నిలదీశారు. ‘తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈ ప్రచార పర్యటనలు చేసేందుకు మీకెవరు అధికారమిచ్చారు రాహుల్ జీ?’ అని ప్రశ్నించారు. ‘దమ్ముంటే మేం సంధించే ప్రశ్నలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

