అనుమతులిచ్చి అడ్డుకున్నారు!
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ చుట్టూ వీసాల వివాదం ముసురుకుంది. విదేశాంగ శాఖ(ఎంఈఏ) నుంచి ముందస్తు అనుమతులు పొందినప్పటికీ 315 మంది విదేశీ వక్తల్లో 115 మందికి భారత్‌లోకి ప్రవేశాన్ని నిరాకరించారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు.
- 115 మంది విదేశీ ప్రతినిధులకు నోఎంట్రీ భారత్ సమ్మిట్ చుట్టూ ముసిరిన వివాదాలు
హైదరాబాద్ : తెలంగాణలోని హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ చుట్టూ వీసాల వివాదం ముసురుకుంది. విదేశాంగ శాఖ(ఎంఈఏ) నుంచి ముందస్తు అనుమతులు పొందినప్పటికీ 315 మంది విదేశీ వక్తల్లో 115 మందికి భారత్‌లోకి ప్రవేశాన్ని నిరాకరించారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. మరికొందరి వీసాలను రద్దు చేసినట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకే ఈ పరిణామాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ వివాదంలో నార్వేకు చెందిన 29 ఏండ్ల జర్నలిస్ట్ హెల్లె లింగ్ స్వెండర్స్ వ్యవహారం చర్చనీయాంశమైంది.
నార్వే వార్తా పత్రిక ‘డాగ్సావిజన్’లో పనిచేస్తున్న ఆమెకు భారత్‌లో పర్యటించేందుకు వీసాతో పాటు రాజకీయ అనుమతులు కూడా లభించాయి. ఆమె భారత్ సమ్మిట్‌లో జర్నలిజం భవిష్యత్తుపై జరిగే చర్చలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఓస్లోలోని భారత రాయబార కార్యాలయం ఆమె విమానాశ్రయానికి బయలుదేరడానికి కేవలం 10 నిమిషాల ముందు ప్రయాణం చేయవద్దని సమాచారం ఇచ్చింది. అనంతరం ఆమె వీసా రద్దు చేసినట్లు వెల్లడైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

