భారత్ సమ్మిట్-2026 ప్రారంభం
భారత్ సమ్మిట్-2026 రెండో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ వేదికగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్‌కు భారత్‌తోపాటు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న సుమారు 70 దేశాల నుంచి ప్రతినిధులు, విధాన రూపకర్తలు, మేధావులు హాజరయ్యారు.
- నోవాటెల్ వేదికగా నిర్వహణ.. హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు
- సంవృద్ధి భారత్, ఏఐసీసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : భారత్ సమ్మిట్-2026 రెండో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ వేదికగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్‌కు భారత్‌తోపాటు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న సుమారు 70 దేశాల నుంచి ప్రతినిధులు, విధాన రూపకర్తలు, మేధావులు హాజరయ్యారు. సంవృద్ధి భారత్ సంస్థ, ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో శుక్రవారం నాలుగు అంశాలపై గ్రూప్ చర్చలు జరిగాయి .‘సహకార సమాఖ్యవాదం’, సంస్కృతి-సమాజం’, ‘యువత-క్రీడలు, ‘ఎన్నికల సమగ్రత (పారదర్శకత, ఓటర్ల హకులు, ఈసీ పాత్ర), సామాజిక న్యాయం’ అనే అంశాలపై ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించారు. అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం జరిగింది. ఎలక్ట్రానిక్స్, తయారీ, ఔషధాలు, క్లీన్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, టెలికాం ఇంజినీరింగ్, ఫార్మా, ఐటీ/ ఐటీఈఎస్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అన్ని రకాలుగా అనుకూలమని శ్రీధర్‌బాబు వివరించారు.
రాష్ట్రంలో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంతోపాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు రావాలని కోరారు. పెట్టుబడులను పరిశ్రమలుగా, పరిశ్రమలను ఉపాధి అవకాశాలుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు పూర్తి అవుతున్న సందర్భంగా.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతిని పురసరించుకుని ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగే ముగింపు కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. గిగ్ వర్కర్స్ పాలసీని ప్రారంభిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

