వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో కేటీఆర్.. ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన యువనేత
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో మన దేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు మంత్రి కేటీఆర్ కాగా, మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా.
KTR | తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో మన దేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు మంత్రి కేటీఆర్ కాగా, మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా.
అయితే ఈ లిస్టులో ఎంపీ కంటే మంత్రికేటీఆరే ముందు వరుసలో నిలబడి సత్తా చాటారు. అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్.. రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో కేటీఆర్ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. కాగా, ఈ లిస్టులో తెలంగాణ ఐటీ శాఖకు చెందిన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ 22వ స్థానాన్ని దక్కించుకుంది.
ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. మరోవైపు సమస్యల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తూ అండగా నిలుస్తుంటారు. ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్‌కు చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్.. దావోస్ పర్యటనలో ఉన్నారు.
Top 30 Influencers for the World Economic Forum @GretaThunberg
@vanessa_vash@SumakHelena@wef@NazaninBoniadi@Davos@hedera@femalequotient
@MarshMcLennan@Zurich@JimHarris@KTRTRS@WHO@Thomas_Binder@AveryDennisonvia KCORE Analytics#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/KB1rfiOr4Q
— Jim Harris (@JimHarris) January 16, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

