KTR | ఆడబిడ్డల సంక్షేమంలో ఎదురులేదు.. మహిళా సాధికారతలో తిరుగులేదు.. మంత్రి కేటీఆర్ ట్వీట్
KTR | ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదని, మహిళా సాధికారతలో తిరుగులేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
KTR | ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదని, మహిళా సాధికారతలో తిరుగులేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఆకాశంలో సగం కాదు.. ఆమె ఆకాశం. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం’ అంటూ ట్వీట్ చేశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
‘ఆకాశంలో సగం కాదు.. ‘ఆమే’ ఆకాశం
సంక్షేమంలో సగం కాదు.. ‘ఆమే’ అగ్రభాగం
మహిళా సంక్షేమంలో.. మన తెలంగాణ రాష్ట్రం..
యావత్ దేశానికే ఆదర్శం..
అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి…
ఆరు పదులు దాటిన అవ్వల వరకు…
అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది…
మనసున్న కేసీఆర్ సర్కార్
గర్భిణులకిచ్చే న్యూట్రిషన్ కిట్లు
ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులు
ఆడబిడ్డ పుట్టిందంటే…
ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే…
కేసీఆర్ కిట్ తోపాటు అందే 13 వేలు..
ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు
లక్ష్మీ కటాక్షమే కాదు…
తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం
కార్పొరేట్‌కు దీటైన
గురుకులాలతో తల్లిదండ్రుల కలలు సాకారం
ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన ‘షీటీమ్’ ఓ సంచలనం..
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ‘వీహబ్’ ఓ సంకల్పం..
స్థానికసంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. ఓ నవశకం..
మారెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. ఓ ప్రోత్సాహం..
ప్రతి బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ ఓ గొప్ప సంప్రదాయం
కల్యాణలక్ష్మి కేవలం పథకంకాదు… ఒక విప్లవం
ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్..
మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్..
ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా
పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ
సీఎం కేసీఆర్..
గుకెడు మంచినీళ్ల కోసం
మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను
మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన
విజన్ ఉన్న ముఖ్యమంత్రి.. సీఎం కేసీఆర్
మన అంగన్ వాడీలను, ఆశా కార్యకర్తలను
వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసిన సందర్భం..
దేశంలోనే అత్యధిక పారితోషికాలతో..
గౌరవప్రదంగా జీవించే గొప్ప అవకాశం..
ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదు.
మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదు
అమ్మఒడి వాహనమైనా..
ఆరోగ్యలక్ష్మి పథకమైనా..
నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం..
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హర్షం..
భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా..
ఒంటరి మహిళలకు తండ్రిలా…
ఆడబిడ్డలకు మేనమామలా..
అవ్వలకు పెద్దకొడుకులా…
కొండంత అండగా నిలుస్తున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

