నేపాలీ కుటుంబానికి కేటీఆర్ చేయూత

- ట్విట్టర్ మెసేజ్‌కు మంత్రి స్పందన
- ఆదుకోవాలని ఎమ్మెల్యేకు ఆదేశం
- డబుల్బెడ్రూం ఇల్లు, పింఛన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి హామీ
హాలియా, ఆగస్టు 10: అద్దె ఇల్లు ఇచ్చేవారు లేక, కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నేపాలీ కుటుంబానికి మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. నేపాల్‌లోని కాఠ్మండుకు చెందిన భవాని బహుదూర్ కుటుంబంతో కలిసి నల్లగొండ జిల్లా హాలియాకు 20 ఏండ్లక్రితం వచ్చాడు. అద్దె ఇంట్లో ఉంటూ రాత్రి సమయంలో గూర్ఖాగా పనిచేస్తూ జీవించేవాడు. అతనికి 8 మంది సంతానం. అందులో ఆరుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం వీరికి రేషన్‌కార్డు సైతం మంజూరు చేసింది. కాగా, ఇటీవల బహుదూర్‌ను ఇల్లు ఖాళీ చేయాలని యజమాని కోరాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వారికి హాలియాలో ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఉండేందుకు ఇల్లు లేక బహుదూర్ కుటుంబం పడుతున్న ఇబ్బందిని వివరిస్తూ అదే కాలనీవాసి గొట్టిముక్కుల నరేశ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో మెసేజ్ చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు సూచించారు. ఎమ్మెల్యే భగత్ మంగళవారం సాయంత్రం బహుదూర్ కుటుంబాన్ని కలిశారు. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు, హాలియా మున్సిపాలిటీలో బహుదూర్‌కు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. బహుదూర్ పినతండ్రికి పింఛన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్యలను వినడంతోపాటు బతుకుదెరువు కల్పించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే భగత్‌కు రుణపడి ఉంటామని బహుదూర్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

