స్వదేశానికి ‘కొడంగల్’ లక్ష్మి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మానవతా హృ దయాన్ని చాటుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రా జుకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఆ కుటుంబంలో ఆనందం నింపారు.
- ఉపాధి కోసం వెళ్లి మస్కట్‌లో చిక్కుకున్న తన తల్లిని కాపాడాలంటూ ఇటీవల కేటీఆర్‌కు కుమారుడి అభ్యర్థన
- ఇచ్చిన హామీ మేరకు ఆమెను క్షేమంగా రాష్ర్టానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన తుప్పుడు లక్ష్మి
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మానవతా హృ దయాన్ని చాటుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రా జుకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఆ కుటుంబంలో ఆనందం నింపారు. ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసం చేయడంతో మసట్లో చికుకుపోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫసల్వాడకు చెందిన తుప్పుడు లక్ష్మి, భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మసట్ వెళ్లారు.
అకడికి చేరుకున్న తర్వాత ఏజెంట్ చెప్పినదానికి భిన్నమైన పని అప్పగించడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యజమాని ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకొని స్వదేశానికి పంపేందుకు నిరాకరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తనను విదేశాలకు పంపిన ఏజెంట్ కూడా ఫోన్‌కు స్పందించకుండా, తిరిగి భారత్‌కు వచ్చేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్టు వాపోయారు. ఈ క్రమంలో ఆమె వైఫై, సిమ్‌కార్డు సేవలు కూడా నిలిచిపోవడంతో కుటుంబసభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరికి పకింటి వారి సాయంతో తన కుమారుడు రాజును సంప్రదించి అకడ ఎదురొంటున్న ఇబ్బందులను వివరించారు.

ఇటీవలే కేటీఆర్ దృష్టికి
తల్లి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్‌ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్ నెల రోజుల్లోనే పాస్‌పోర్టు సమస్య పరిషరించి, ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. ఆ మేరకు చొరవ తీసుకోవడంతో లక్ష్మి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. కుటుంబసభ్యులను కలుసుకున్న లక్ష్మి, మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కేటీఆర్ అన్నకు రుణపడి ఉంటా
నేను, నా కుటుంబం ఎదురొంటున్న కష్టకాలంలో కేటీఆర్ అన్న మాకు అండగా నిలిచారు. ఆయన చేసిన సాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. కేటీఆర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. – లక్ష్మి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

