వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలే
యువతలో అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
- యువతలో అపార శక్తిసామర్థ్యాలు
- వారికి సరైన మార్గదర్శకత్వం చేయాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ‘లిట్-2026’ పోస్టర్ ఆవిషరణ
- వరంగల్ ఇంజినీరింగ్ విద్యార్థుల సరికొత్త కార్యక్రమానికి మద్దతు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : యువతలో అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వరంగల్ ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన వినూత్న కార్యక్రమానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థుల బృందం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ భేటీలో ప్రస్తుత ఇంజినీరింగ్ విద్య, పెరుగుతున్న సాంకేతిక మార్పులు, ఆధునిక ఉపాధి అవకాశాలు, యువతకు అవసరమైన వృత్తి నైపుణ్యాలపై కేటీఆర్‌తో విద్యార్థులు చర్చించారు. వరంగల్ యువతలోని ప్రతిభ, సృజనాత్మక ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను వెలికితీసి ఒకే వేదికపైకి తేవాలనే లక్ష్యంతో విద్యార్థులు ‘జెన్‌జెడ్ యూత్ ఈవెంట్ లిట్ 2026’, ‘వై నాట్ ఇన్ వరంగల్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ వినూత్న వేదిక ద్వారా టైర్-2 నగరమైన వరంగల్లోనూ సరికొత్త అవకాశాలను సృష్టించవచ్చని వివరించారు.
అనంతరం ఈ ప్రతిష్టాత్మక యువజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. విద్యార్థుల ఆలోచనా సరళి, నాయకత్వ దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించిన కేటీఆర్, వారిని ప్రోత్సహిస్తూ ‘లిట్ 2026’ ఈవెంట్ పోస్టర్‌ను వారితో కలిసి ఆవిషరించారు. వరంగల్ యువ ఇంజినీర్ల ఆశయాలకు ప్రతిరూపంగా నిలువనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, యువత భవిష్యత్తుకు బాటలు వేసే ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

